ఇండియాలోనే నెంబర్ 1 స్థానాన్ని అధిరోహించిన ‘జై లవ కుశ’!
Published on Sep 25, 2017 8:41 am IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ చిత్రం గత గురువారం విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మొదటి రెండు రొజుల్లొనే రికార్డ్ కలెక్షన్లను సాధించిన ఈ చిత్రం నాలుగు రోజులు గడిచే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.62 కోట్ల గ్రాస్ ను, రూ.40 కోట్ల షేర్ ను రాబట్టుకుంది. నడుస్తున్నవి దసరా సెలవులు కావడం సినిమాకు బాగా కలిసొచ్చింది.

ఓవర్సీస్లో సైతం శనివారం వరకు 1.28 మిలియన్ డాలర్లను కొల్లగొట్టి ఒకటిన్నర మిలియన్ల మార్కుకు దగ్గరైంది. ఇక ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం బాలీవుడ్ తో సహా మరే పరిశ్రమలోనూ పెద్ద చిత్రం రిలీజవకపోకవడంతో ఈ వీకెండ్ 22 నుండి 24 వరకు గాను ఇండియా బాక్సాఫీస్ వద్ద ‘జై లవ కుశ’ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఈ వసూళ్లు ఇలాగే కొనసాగిస్తే చిత్రం త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

 
Like us on Facebook