‘జై లవ కుశ’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేశారు !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘జై లవ కుశ’ ట్రైలర్ లాంచ్ తరుణం ఇంకొద్దిసేపట్లో ఆసన్నం కానుంది. సాయంత్రం 6 గంటల 30 నిముషాలకు ట్రైలర్ ను విడుదలచేస్తున్నట్టు నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ తెలిపింది. అది కూడా తారక్ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ నుండే ట్రైలర్ ను బయటికి వదలనున్నారు. దీంతో అభిమానులంతా ఇప్పటి నుండే సోషల్ మీడియాలో సందడి మొదలుపెట్టారు.

మూడు పాత్రలో ఒకేసారి తెరపై ఎలా కనిపిస్తాడో చూడాలని అందరూ తహ తహలాడి పోతున్నారు. మరోవైపు ఈ ట్రైలర్ లాంచ్ వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అభిమానులు భారీ సంఖ్యలో హాజరవుతుండటంతో వేడుక పాస్ లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న రిలీజ్ చేయనున్నారు. ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా రాశి ఖన్నా, నివేత థామస్ లు నటించారు.