‘జై లవ కుశ’ లో అభిమానులను సప్రైజ్ చేసేలా 5వ పాట!


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘జై లవ కుశ’ చిత్రం యొక్క ఆడియో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు రిలీజైన సంగతి తెలిసిందే. ఆడియో ఆల్బమ్ లో ఉన్న నాలుగు పాటలు ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటుండగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సంగీత ప్రియులను అలరిస్తోంది. కానీ అభిమానాలు ఇంత మంచి ఆడియోలో కేవలం నాలుగు పాటలేనా అని కాస్త నిరుత్సాహపడ్డారు.

కానీ ఆడియోలో ఉన్నది నాలుగు కాదని, ఐదు పాటలని, ఐదో పాటను త్వరలోనే రిలీజ్ చేస్తామని ఎన్టీఆర్ కొద్దిసేపటి క్రితమే తెలిపారు. అంతేగాక ఫోక్ స్టైల్లో ఉండే ఈ పాట ప్రత్యేకమైనదని, త్వరలోనే దీన్ని రిలీజ్ చేస్తామని కూడా అన్నారు. టాక్ ప్రకారం ఈ పాటలో డ్యాన్సులు, మ్యూజిక్ ఒక రేంజులో ఉంటాయని తెలుస్తోంది. మరి ఎన్టీఆర్, దేవిశ్రీ కలిసి ఎలాంటి మ్యాజిక్ చేశారో తెలియాలంటే ఇంకాస్త వెయిట్ చేయాల్సిందే.