సీడెడ్ లో భారీ ధర పలికిన ‘జై లవకుశ’


జైలవకుశ చిత్ర షూటింగ్ పూర్తయ్యే కొద్ది ఈ చిత్రం ప్రీరిలీజ్ బిజినెస్ కూడా ఊపందుకుంటోంది. తాజగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం సీడెడ్ రైట్స్ భారీ స్థాయిలో 12.6 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ చిత్రం ఈ స్థాయిలో సీడెడ్ లో అమ్ముడవడం ఇదే తొలిసారి.

ఓ వైపు జై లవకుశ చిత్రం షూటింగ్ జరుగుతుండడం, మరోవైపు ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించిన బిగ్ బాస్ షో విజవంతం కావడంతో ఆయన అభిమానులు ఉత్సాహంతో ఉన్నారు. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. మూడు విభిన్నమైన పాత్రలలో ఎన్టీఆర్ ఎలా ఉంటాడో అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే జై పాత్రని పరిచయం చేస్తూ టీజర్ ని విడుదల చేశారు. ఆగష్టు 7 న మరో టీజర్ ని విడుదల చేయనున్నారు.