గోదావరి జిల్లాల్లో తారక్ సత్తా ఏవిధంగా పనిచేసిందో చూద్దాం !
Published on Sep 22, 2017 5:00 pm IST


ఎన్టీఆర్ తాజా చిత్రం ‘జై లవ కుశ’ కృష్ణా, గుంటూరు, నైజాం ఏరియాల్లో కలెక్ట్ చేసినట్టే రెండు గోదావరి జిల్లాల్లోనూ భారీ వసూళ్లను రాబట్టింది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు తూర్పు గోదావరి జిల్లాలో రూ. 2.96 కోట్ల రూపాయల షేర్ ను సాధించిన ఈ చిత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.1.80 కోట్ల షేర్ ను రాబట్టింది.

ఇలా కలెక్షన్లకు కీలకమైన గోదావరి జిల్లాలో మంచి పట్టు సాధించడంతో తెలుగు రాష్ట్రాల మొత్తం కలెక్షన్లు రూ.21.91 కోట్ల షేర్ గాను, రూ. 32.1 కోట్ల గ్రాస్ గాను ఉన్నాయి. ఇక రాబోయే రోజులు కూడా దసరా సెలవులు కావడంతో ఈ వసూళ్లు ఇలాగే మెరుగ్గా సాగే అవకాశముంది. ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తూ చేసిన ఈ చిత్రం ఆయన అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.

 
Like us on Facebook