జై లవకుశ హిందీ డబ్బింగ్ రైట్స్ డీల్ అదిరింది


విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ చిత్రం అంచనాలు పెరిగిపోతున్నాయి. చిత్ర యూనిట్ కూడా ఒక ప్లానింగ్ ప్రకారం ప్రమోషన్ కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో మూడు పాత్రలని పరిచయం చేస్తూ ఇప్పటికే మూడు టీజర్లని విడుదల చేశారు. అన్ని టీజర్లకు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ అంచనాలతో చిత్ర బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగుతోంది.

తాజాగా సమాచారం ప్రకారం ఈ చిత్ర హిందీ డబ్బింగ్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనట్లు తెలుస్తోంది. జీ సినిమా సంస్థ దాదాపు 11 కోట్లు వెచ్చించి జై లవ కుశ హిందీ డబ్బింగ్ హక్కులని సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలకు హిందీలో మంచి టిఆర్పి రేటింగులు దక్కుతున్నాయి. ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ కూడా ఆకాశాన్ని అంటే విధంగా జరుగుతున్నట్లు సమాచారం. బాబీ దర్శకత్వంలో ఈ చిత్ర రూపుదిద్దుకుంటోంది.