ఇంకొద్దిసేపట్లో రివీల్ కానున్న ‘జై లవ కుశ’ అప్డేట్ !

15th, September 2017 - 08:53:03 AM


తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఎన్టీఆర్ నటించిన ‘జై లవ కుశ’ కూడా ఒకటి. ఇప్పటికే బోలెడంత క్రేజ్ ను జనరేట్ చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 21న భారీ ఎత్తున రీలీజ్ కానుంది. ట్రైలర్స్, పాటలు అన్నీ జనాల్లోకి బాగా వెళ్లిపోవడంతో ఏర్పడ్డ పాజిటివ్ టాక్ భారీ ఓపెనింగ్స్ సాదించేందుకు దోహదపడనుంది. ఎన్టీఆర్ మూడు పాత్రలు చేయడంతో ఆయన నటన ఎలా ఉంటుందో చూడలానే ఆసక్తి అందరిలోనూ ఉండగా దాన్ని అలాగే నిలిపి ఉండేందుకు ఇంకో అంశాన్ని సిద్ధం చేసింది టీమ్.

అదే ఆడియోలోని 5వ పాట. ప్రత్యేక గీతంగా ఉండనున్న ఈ పాట యొక్క అప్డేట్ ను ఈరోజు ఉదయం 9 గంటల 30 నిముషాలకు ప్రకటించనున్నారు. అనగా పాట విడుదల సమయాన్ని రివీల్ చేయనున్నారు. కొరియోగ్రఫీ దగ్గర్నుంచి మ్యూజిక్ వరకు అన్నింటిలోనూ కొత్తదనం ఉండే ఈ పాట అభిమానులకు, ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందట. ఇక ఈ పాటలో మిల్కీ బ్యూటీ తమన్నా ఎన్టీఆర్ తో ఆడి పాడింది. మరి ఇన్నాళ్లు ఎంతగానో ఊరించిన ఈ పాట ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొద్ది సమయం వేచి చూడాల్సిందే.