రెండవ టీజర్ విడుదలకు సిద్దమవుతున్న ‘జై లవ కుశ’ !
Published on Jul 14, 2017 8:00 am IST


‘ఆ రావణున్ని చంపాలంటే సముద్ర దాటాల.. ఈ రావణున్ని సంపాలంటే సముద్రమంత ధైర్యం ఉండాల’ అంటూ టీజర్ తోనే సంచలనం సృష్టించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిత్రం ‘జై లవ కుశ’ రెండవ టీజర్ విడుదలకు సిద్ధమవుతోంది. తారక్ చేస్తున్న మూడు పాత్రల్లో ఒకటైన లవ కుమార్ పై ఈ టీజర్ ఉండనుంది. మొదటి టీజర్ లో ఎన్టీఆర్ పాత్ర, అభినయం అద్భుతంగా ఉండటంతో రెండవ పాత్ర ఎలా ఉంటుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు.

ప్రస్తుతం ఆ పనుల్లోనే ఉన్న టీమ్ ఈ నెలాఖరుకు టీజర్ ను రిలీజ్ చేస్తారని వినికిడి. ఇకపోతే చిత్ర షూటింగ్ పూణేలోని లోనావాలాలోని ఒక భారీ బంగ్లాలో జరుగుతోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, నివేత థామస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 21న విడుదల చేయనున్నారు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook