ఇండియా లో సాలిడ్ వసూళ్ళతో దూసుకు పోతున్న “జాన్ విక్ 4”

ఇండియా లో సాలిడ్ వసూళ్ళతో దూసుకు పోతున్న “జాన్ విక్ 4”

Published on Mar 28, 2023 10:27 PM IST


అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ జాన్ విక్ 4 థియేటర్ల లో విడుదల అయ్యి యాక్షన్ ప్రేమికులను, ఫ్యాన్స్ ను అలరిస్తోంది. ఈ చిత్రం ఇండియా లో కూడా భారీగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇండియా లో ఇప్పటి వరకూ 30 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేయడం జరిగింది. అంతేకాక వరల్డ్ వైడ్ గా 137.5 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ఇండియా ఇంగ్లీష్ తో పాటుగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కూడా రిలీజ్ అయ్యింది.

ఈ చిత్రం కి లాంగ్ రన్ లో ఇక్కడ మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. కీనూ రీవ్స్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి చాడ్ స్టాహెల్స్ కీ దర్శకత్వం వహించారు. డానీ యెన్, బిల్ స్కార్స్ గార్డ్, లారెన్స్ ఫిష్ బర్నే, హిరోయుకి సనడ, శమైర్ అండర్సన్ తదితరులు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు