రిపబ్లిక్ నుండి జోర్ సే పాట విడుదల!

Published on Sep 6, 2021 2:00 pm IST


దేవ కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్ లు హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న తాజా చిత్రం రిపబ్లిక్. ఈ చిత్రం లో జగపతి బాబు, రమ్యకృష్ణ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి తాజాగా జోర్ సే అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ పాట మంచి జోష్ తో ఉండటం తో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. తన హృదయానికి నచ్చిన విధంగా డాన్స్ చేసేందుకు ఇదొక అవకాశం అంటూ సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చారు. ఈ పాట కి పని చేయడం చాలా బాగుంది అని తెలిపారు. మేము ఎంత బాగా చేశామో అదే తరహాలో మీకు తప్పకుండా నచ్చుతుంది అంటూ చెప్పుకొచ్చారు.

ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అనురాగ్ కులకర్ణి, సాకి శ్రీనివాస్ మరియు బరిమిసెట్టి లు పాడగా, సుద్దాల అశోక్ తేజ ఈ పాటను రాయడం జరిగింది. జేబీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని జే. భగవాన్ మరియు జే. పుల్లా రావు లు నిర్మిస్తున్నారు.

వీడియో సాంగ్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :