“RRR” ఏ కారణంతో ఓకే చేసారో రివీల్ చేసిన చరణ్, తారక్.!

“RRR” ఏ కారణంతో ఓకే చేసారో రివీల్ చేసిన చరణ్, తారక్.!

Published on Dec 31, 2021 11:02 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియన్ వైడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” ప్రమోషన్స్ లో హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సహా దర్శకుడు రాజమౌళి కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అసలు గ్యాప్ లేకుండా అన్ని భాషల్లోని నిర్విరామంగా ఇంటర్వ్యూలు ఈవెంట్ లు అంటూ తిరిగేస్తున్నారు.

మరి వీటిలోనే మరిన్ని ఆసక్తికర అంశాలు వీరు రివీల్ చేస్తున్నారు. అలా లేటెస్ట్ గా అసలు తాము ఈ సినిమా ఏ కారణం చేత ఓకే చేశారు అనే ప్రశ్నకి సమాధానం ఇచ్చారు. ఈ చిత్రాన్ని కథ పరంగా ఓకే చేసారా లేక దర్శకుడు రాజమౌళి అని ఓకే చేసారా అని అడగ్గా ఖచ్చితంగా రాజమౌళి వల్లనే అని ఇద్దరూ చెప్పారు.

రాజమౌళి సినిమాలు అన్నాక కథలు ఎలా ఉంటాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు అని తాను మాకు ఇది సూట్ అవుతుంది అంటేనే రాజమౌళి తీసుకొస్తాడు అందుకే మాకు కాల్ చేసినప్పుడే కథ ఏమిటి అనేవి ఏమి అడగలేదు డైరెక్ట్ ఓకే చెప్పేశాం అని ఎన్టీఆర్, చరణ్ లు ఒకే సమాధానం ఇచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు