పచ్చటి గడ్డి మీద పడుకుని రిలాక్స్ అవుతున్న చెర్రీ, తారక్..!

Published on Mar 1, 2022 6:53 pm IST


టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం “రౌద్రం రణం రుధిరం”. కరోనా కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదాపడుతూ వస్తున్న ఈ చిత్రం మార్చి 25న విడుదల కాబోతుంది. అయితే మార్చి రెండో వారం నుంచి మళ్లీ ఈ చిత్ర ప్రమోషన్స్ మొదలుకానుండగా, తాజాగా ఫ్యాన్స్ కి ఒక చిన్న సర్‌ప్రైజ్‌ని ఇచ్చింది చిత్ర బృందం.

రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ షూటింగ్ విరామంలో హాయిగా పచ్చటి గడ్డి మీద మ్యాట్స్ పై సేదతీరుతూ, ఫోన్స్ చూస్తూ ఉండే ఫోటోను పంచుకుంది. “కెమెరా రోలింగ్‌లో లేనప్పుడు స్క్రోలింగ్ చేస్తున్నారు” అని క్యాప్షన్ ఇచ్చిన ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. చాలా రోజుల తర్వాత ఆర్ఆర్ఆర్ షూటింగ్ స్పాట్‌లో చెర్రీ, తారక్‌లని ఇలా చూడడంతో అభిమానులు కూడా ఈ ఫోటోని తెగ ట్రెండ్ చేస్తున్నారు.

ఇకపోతే డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరిస్, సముద్రఖని, అజయ్ దేవగన్, శ్రియా శరణ్ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :