వైరల్ పిక్స్ : 13వ రోజు కార్యక్రమంలో తారకరత్న కు నివాళులు అర్పించిన ఎన్టీఆర్, బాలయ్య

Published on Mar 2, 2023 6:10 pm IST

నందమూరి తారకరామారావు గారి మనవడు మరియు నటుడు అయిన నందమూరి తారకరత్న ఇటీవల గుండెపోటుకు గురై, ఆ తరువాత 23 రోజుల పాటు బెంగళూరు హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స అనంతరం మరణించిన విషయం అందరికీ తెలిసిందే. కెరీర్ పరంగా ఎన్నో సక్సెసుల్ సినిమాల్లో నటించిన తారకరత్న మరణంతో యావత్ నందమూరి కుటుంబంతో పాటు తెలుగు ఆడియన్స్ అందరూ కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇక నేడు తారకరత్న 13వ రోజు కార్యక్రమాన్ని హైదరాబాద్ ఫిలిం నగర్ లోని కల్చరల్ క్లబ్ లో నిర్వహించారు.

కాగా ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబసభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కాగా వీరిలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ సతీమణి వసుంధరా దేవి, సహా మరికొందరు ఉన్నారు. కాగా తారకరత్నని తల్చుకుని ఎన్టీఆర్, అలానే బాలయ్య ఇద్దరూ కూడా ఒకింత ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ తారకరత్న చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :