మాసివ్..”బింబిసారుడు” కోసం వస్తున్న తారక రాముడు.!

Published on Jul 26, 2022 1:01 pm IST

ఇప్పుడు మన టాలీవుడ్ ఆడియెన్స్ లో సాలిడ్ బజ్ నెలకొల్పుకొని రిలీజ్ కి సిద్ధంగా లేటెస్ట్ చిత్రాల్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “బింబిసార” కూడా ఒకటి. దర్శకుడు వశిష్ఠ్ తో కళ్యాణ్ రామ్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో చేసిన ఒక యూనిక్ టైం ట్రావెల్ సినిమా ఇది కాగా చాలా గ్రాండ్ గా మేకర్స్ ఈ చిత్రాన్ని సిద్ధం చేశారు. మరి ఈ సినిమా పాటలు ట్రైలర్స్ కి ఆల్రెడీ మాసివ్ రెస్పాన్స్ రాగా ఇపుడు మేకర్స్ మరో మాసివ్ అప్డేట్ ని అందించారు.

తమ బింబిసారుడు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు వస్తున్నట్టుగా మేకర్స్ సాలిడ్ అనౌన్సమెంట్ ని అందించారు. మరి ఈ జూలై 29న శిల్పకళావేదికలో ఈ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా ఎన్టీఆర్ కూడా భాగం కానున్నారు. దీనితో ఇప్పుడు ఈ సినిమాపై హైప్ నందమూరి అభిమానుల్లో మరో లెవల్ కి వెళ్లనుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :