వైరల్..తారక్ మనసులో చరణ్ కి అంతటి ఉన్నత స్థానం.!

వైరల్..తారక్ మనసులో చరణ్ కి అంతటి ఉన్నత స్థానం.!

Published on Dec 30, 2021 8:00 AM IST

ప్రస్తుతం పాన్ ఇండియన్ వైడ్ వీక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రాజమౌళి ప్లాన్ చేసిన ఈ సాలిడ్ మల్టీ స్టారర్ ఒడ్డారు హీరోలకి పరస్పరంగా చాలా బిగ్ టర్న్ లాంటిది అని చెప్పాలి.

కేవలం తమ కెరీర్ పరంగానే కాకుండా సినిమాలో ఇద్దరి పాత్రలు ఎంతటి బలమైన స్నేహ బంధంతో కనిపిస్తారో అదే విధంగా ఈ ఇద్దరు హీరోలు నిజ జీవితంలో కూడా మారిపోయారు. మొన్న తమిళ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఎన్టీఆర్ తో తన చనిపోయే వరకు కూడా ఉంటుంది అని తెలుపగా ఆ మాటలు ఎంతగానో వైరల్ అయ్యి వీరి స్నేహ బంధంపై ప్రతి ఒక్కరికీ ఒక క్లారిటీ ఇచ్చాయి.

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కూడా తన బాండ్ ఎంత గట్టిదో వివరించడం అంతే వైరల్ అవుతుంది. చరణ్ నాకు కుడి వైపా ఎడమ వైపా అంటే ఖచ్చితంగా ఎడమ వైపే అంటానని ఎందుకంటే గుండె ఎడమ వైపే ఉంటుంది కదా అని చరణ్ కి అంతటి స్థానం ఇచ్చాడు. దీనితో ఇరు హీరోల అభిమానుల నడుమ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు