ఇంట్రెస్టింగ్..పవన్ స్టైల్ లో తన స్పీచ్ ముగించిన తారక్.!

Published on Jan 2, 2022 8:06 am IST

మన స్టార్ హీరోల్లో మైక్ పట్టుకుంటే ఆడియెన్స్ ఆసక్తిగా వినే అద్భుతమైన స్పీచ్ ఇచ్చే హీరోలలో అందులోని మాస్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ లు ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటారు. అయితే ఈ ఇద్దరు హీరోలకి కూడా తెలిసినంత మేరలో ఆఫ్ లైన్ లో మంచి అనుబంధం కూడా ఉంది.

అయితే ఈ ఇద్దరు హీరోలు కూడా ఏదైనా స్పీచ్ ఇచ్చినప్పుడు చాలా ఆసక్తిగా తమ అభిమానులు వింటారు. అలా పవన్ ఎప్పుడు స్పీచ్ ఇచ్చినా కూడా ముగించే ముందు తల్లి భారతిని స్మరిస్తూ “జై హింద్” అని జై కొట్టి ముగిస్తారు. ఇది తెలుగు ఆడియెన్స్ అందరికీ కూడా తెలుసు.

కానీ తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా లేటెస్ట్ గా తమ భారీ సినిమా “RRR” ముంబై ఈవెంట్ లో తాను ఇచ్చిన స్పీచ్ అనంతరం కూడా పవన్ లానే “జై హింద్” అని చెప్పి ముగించడం కాస్త ఇద్దరి హీరోలకి యాదృచ్చికంగా కలిసింది అని చెప్పాలి. దీనితో ఈ అంశం ఆసక్తిగా అనిపిస్తుంది. ఒకవేళ సందేహం ఉంటే ఆ ఈవెంట్ లాస్ట్ లో తారక్ స్పీచ్ విని చూడొచ్చు.

సంబంధిత సమాచారం :