దే’వర’ 2 రిలీజ్ పై బిగ్ న్యూస్.. నేరుగా నిర్మాతే!

devara-2

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రమే “దేవర”. మంచి అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చి భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రానికి సీక్వెల్ దే’వర’ 2 (DeVara 2) అసలు ఉందా లేదా అంటూ ఎన్నెన్నో రూమర్స్ వినిపిస్తూ వచ్చాయి. కానీ ఫైనల్ గా వాటి అన్నిటికి ఒక పెద్ద చెక్ మేట్ ఇప్పుడు పడింది. ఇటీవల దేవర 2 విషయంలో పలు ఆసక్తికర అప్డేట్స్ మేము అందించాము. మరి వాటికి మరింత బలాన్ని చేకూరుస్తూ నిర్మాత ఇచ్చిన బిగ్ న్యూస్ బయటకి వచ్చింది.

Devara 2 Release Update – దేవర 2 షూట్, రిలీజ్ పై నిర్మాత బిగ్ అప్డేట్

బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిన దేవర 1 కి కొనసాగింపుగా దే’వర’ 2 (DeVara Part 2) అనౌన్స్ చేశారు కానీ ఇది అలా ఆలస్యం అవుతూ వచ్చింది. కానీ లేటెస్ట్ గా నిర్మాతలలో ఒకరైన మిక్కిలినేని సుధాకర్, యువసుధా ఆర్ట్స్ అధినేత అందించారు. దేవర 2 షూటింగ్ ఈ ఏడాది మే నుంచి మొదలు కానుంది అని వచ్చే ఏడాదిలోనే రిలీజ్ అవుతుంది అని కన్ఫర్మ్ చేశారు. సో ఇది మాత్రం ఫ్యాన్స్ కి ఊహించని ట్రీట్ అప్డేట్ అని చెప్పొచ్చు.

NTR Neel – నీల్ ప్రాజెక్ట్ తో తారక్ బిజీ

ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కొంతమేరే పూర్తయ్యింది కానీ మే నెలకి పూర్తి చేసేస్తారు అనుకోవచ్చు. సో అప్పుడు నుంచి దేవర 2 మొదలు కానుంది.

Exit mobile version