“RRR” సక్సెస్ తో ఎన్టీఆర్ ఎమోషనల్ మెసేజ్.!

“RRR” సక్సెస్ తో ఎన్టీఆర్ ఎమోషనల్ మెసేజ్.!

Published on Mar 29, 2022 12:51 PM IST


లేటెస్ట్ గా ఇండియన్ సినిమా దగ్గర భారీ అంచనాలు నడుమ వచ్చి అంతే రీతిలో హిట్ అయ్యిన బిగ్గెస్ట్ హిట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. దర్శక ధీరుడు రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని నమోదు చెయ్యగా ఇరు హీరోలపై కూడా ప్రశంసలు జల్లు కురుస్తుంది.

మరి ఇలాంటి సినిమాని అందించిన తన సినిమా మేకర్స్ కి మరియు తన సహా నటులకి మొత్తం అందరికీ థాంక్స్ చెబుతూ ఎన్టీఆర్ ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేసి ధన్యవాదాలు తెలిపాడు. మొదటగా తన దర్శకుడు జక్కన్న రాజమౌళికి థాంక్స్ చెబుతూ తనకి ఇలాంటి ఒక గొప్ప పాత్ర ఇచ్చినందుకు ఎప్పుడూ కృతజ్ఞ్యతతో ఉంటానని అలాగే నా బ్రదర్ రామ్ చరణ్ లేకుండా అసలు ఈ సినిమానే ఊహించుకోలేనని రామరాజు పాత్ర గాని భీమ్ గాని నువ్ లేనిదే లేవు అని తెలిపాడు.

అలాగే నటుడు అజయ్ దేవగన్, తన హీరోయిన్ ఒలీవియా మోరిస్ ఇలా నటీనటులు అందరూ అలాగే నిర్మాత దానయ్య, సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు, సంగీత దర్శకులు కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ ఇంకా ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఇలా అందరికీ ఈ సినిమాలో తనతో నడిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ తారక్ ఒక ఎమోషనల్ మెసేజ్ ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు.

https://www.instagram.com/p/CbrWZh2F2lf/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు