వైరల్ : ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎమోషనల్ అయ్యిన తారక్.!

వైరల్ : ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎమోషనల్ అయ్యిన తారక్.!

Published on May 28, 2023 8:00 AM IST

మన టాలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ హీరోస్ లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు నందమూరి లెగసీని గ్లోబల్ వైడ్ గా ఎక్కడ నిలిపాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి తారక్ అయితే ఇప్పుడు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం “దేవర” పాన్ ఇండియా లెవెల్లో హైప్ రేపుతూ అందరిలో ఆసక్తి రేపింది.

మరి ఇదిలా ఉండగా గత కొన్ని రోజులు కితం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శతజయంతి వేడుకల్లో అయితే తారక్ పలు కారణాల చేత మిస్ అవ్వడం జరిగింది. మరి ఈరోజు మే 28 తో ఆయన శత జయంతి రోజు కావున జూనియర్ ఎన్టీఆర్ అయితే ఈ ఉదయమే ఎన్టీఆర్ ఘాట్ ని సందర్శించడం జరిగింది.

అయితే ఈ ప్రాంగణం ఎన్టీఆర్ రాకతో కిక్కిరిసిపోగా తారక్ తన తాత గారికు ఘాట్ వద్ద నివాళులు అర్పించి ఆ మహనీయుని స్మరించుకొని అక్కడే ఎమోషనల్ అయ్యిపోయాడు. దీనితో ఈ ఎమోషనల్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇవి చూసిన తారక్ మరియు నందమూరి అభిమానులు మరింత భావోద్వేగానికి లోనవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు