వైరల్ : తారకరత్న కోసం ఎమోషనల్ గా జూ. ఎన్టీఆర్.!

వైరల్ : తారకరత్న కోసం ఎమోషనల్ గా జూ. ఎన్టీఆర్.!

Published on Jan 29, 2023 12:03 PM IST

నందమూరి వారి ప్రముఖ నటుడు నందమూరి తారక రత్న ఇటీవల అనుకోని విధంగా తీవ్ర అస్వస్థత కి లోనయ్యి ఇప్పుడు ప్రాణ పోరాటం చేస్తున్నారు. ముందు నార్మల్ గానే ఉంది త్వరగానే రికవర్ అవుతారు అని అంతా అనుకున్నారు కానీ తర్వాత పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతూ వచ్చింది. దీనితో తనని చూసేందుకు గాను ఈరోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సహా నందమూరి కళ్యాణ్ రామ్ లు బెంగళూరికి పయనం అయ్యారు.

అయితే అక్కడ ల్యాండ్ అయ్యిన తారక్ లేటెస్ట్ ఫోటోలు అయితే ఇప్పుడు బయటకి వచ్చాయి. బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ కి ప్రముఖులు ఆహ్వానం పలకగా ఎన్టీఆర్ పై లేటెస్ట్ ఫోటోలు మరియు వీడియో లు ఇప్పుడు బయటకొచ్చి వైరల్ అవుతున్నాయి. మరి వీటిలో ఎన్టీఆర్ ఎంతో భావోద్వేగానికి లోనైనట్టుగా కూడా కొన్ని విజువల్స్ తమ అభిమానులని మరింత ఎమోషనల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ సహా బాలకృష్ణ మరియు కళ్యాణ్ రామ్ లు అక్కడే ఉన్నారు. మరోపక్క అభిమానులు తారకరత్న త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు