తారక్ ఫ్యాన్స్ మాస్..”RRR” కోసం ఏకంగా థియేటర్ మొత్తం కొనేసారు.!

Published on Mar 6, 2022 2:01 pm IST

మన సౌత్ ఇండియా సినిమా దగ్గర ఉన్న హీరోస్ ని తమ అభిమానులు ఏ రేంజ్ లో ఆరాధిస్తారో అందరికీ తెలిసిందే. తమకి దైవ సమానంగా తన అభిమాన హీరోలపై కనబరుస్తారు. మరి అలాంటి కల్ట్ మాస్ ఫ్యాన్స్ ఉన్న స్టార్ హీరోస్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు.

అసలే తారక్ ని సిల్వర్ స్క్రీన్ పై చూసి మూడున్నర ఏళ్ళు దాటేసింది. దీనితో తాను చేసిన లేటెస్ట్ భారీ సినిమా “RRR” కి తమ కసి ఏ రేంజ్ లో ఉందో తన భీమ్ టీజర్ కి ఇచ్చిన రెస్పాన్స్ తో స్టార్ట్ చేసి ఇప్పుడు సినిమా రిలీజ్ కి వేరే లెవెల్లో చూపిస్తున్నారు.

లేటెస్ట్ గా అయితే ఓవర్సీస్ లో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే “RRR” సినిమా ప్రీమియర్స్ కి గాను ఏకంగా ఒక థియేటర్స్ మొత్తాన్ని బుక్ చేసేసారట. ఫ్లోరిడా లోని టిన్సెల్ టౌన్ సాయంత్రం 6 షోకి మొత్తం థియేటర్ ని కొనేశారట. ఇప్పుడు ఇదే సినీ వర్గాల్లో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. మొత్తానికి అయితే ఎన్టీఆర్ దర్శనం కోసం తన అభిమానులు వేరే స్థాయిలో ఎదురు చూస్తున్నారని చెప్పాలి.

సంబంధిత సమాచారం :