క్రేజీ బజ్ : ఆ స్టార్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ రెండు సినిమాలు చేయనున్నారా ?

Published on Feb 7, 2023 3:01 am IST

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీలో కొమురం బీమ్ పాత్రలో అద్భుత నటన కనబరిచి హీరోగా గ్లోబల్ గా ఎంతో గొప్ప పేరు అందుకున్నారు. ఇక దీని తరువాత తన 30వ సినిమా చేయడానికి సిద్దమవుతున్నారు ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలపై ఎంతో భారీ వ్యయంతో రూపొందనున్న ఈ మూవీ మార్చి నెలాఖరులో ప్రారంభం అయి పక్కాగా 2024 ఏప్రిల్ 4న రిలీజ్ అవుతుందని నిన్నటి అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ప్రకటించారు.

అయితే దీని తరువాత కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో భారీ మాస్ యాక్షన్ మూవీ చేయనున్నారు ఎన్టీఆర్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ ఇప్పటికే వచ్చింది. అయితే విషయం ఏమిటంటే, దీని తరువాత కూడా వెంటనే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మరొక మూవీ కూడా రూపొందనుందనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. అయితే అది వారిద్దరి కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ వారి బ్యానర్ పై తెరకెక్కనున్న మూవీకి సీక్వెలా లేక ఫ్రెష్ సబ్జెక్టా అనేది తెలియాలి. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ మూవీ పై అధికారికంగా ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :