జూ. ఎన్టీఆర్ కు ఆహ్వానం

Published on May 15, 2023 7:26 pm IST

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఆహ్వానం అందింది గానీ, జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రం ఆహ్వానం అందలేదు అంటూ జూనియర్ ఫ్యాన్స్ తెలుగుదేశం పార్టీ నాయకుల పై కామెంట్స్ చేశారు. దీనికితోడు ఖమ్మంలో సీనియర్ ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని తారక్ చేతుల మీదుగా ఆవిష్కరించబోతున్నాడు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుల పై విమర్శలు ఎక్కువైపోయాయి. అందుకే, తెలివిగా ఈ నెల 20 కైతలాపూర్ గ్రౌండ్స్‌లో జరగనున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్‌ కు ఆహ్వానం పంపారు. అన్నట్టు ఈ కార్యక్రమాన్ని సీనియర్ ఎన్టీఆర్ తనయులు నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ పర్యవేక్షిస్తున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ ఈ వేడుకకు వెళ్తాడా ? లేదా ? చూడాలి.

సంబంధిత సమాచారం :