వైరల్ పిక్స్ : డైనమిక్ లుక్స్ లో యంగ్ టైగర్

వైరల్ పిక్స్ : డైనమిక్ లుక్స్ లో యంగ్ టైగర్

Published on Dec 22, 2022 11:00 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల తన స్నేహితుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి చేసిన భారీ పాన్ ఇండియా ఆర్ఆర్ఆర్ తో అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిన ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో తన ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ మనసు దోచుకున్నారు. ఇక అతి త్వరలో కొరటాల శివ తో ఆయన చేయనున్న NTR 30 సినిమా పై అందరిలో భారీ స్థాయి అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్స్ పై రూపొందనున్న ఈ మూవీలో తన పాత్ర కోసం ఇప్పటికే మేకోవర్ పరంగా స్టైలిష్ గా సిద్దమైన ఎన్టీఆర్ కొద్దిరోజుల క్రితం పలు యాడ్స్ లో కూడా కనిపించి ఆకట్టుకున్నారు. ఇక లేటెస్ట్ గా ట్రెండీ స్టైల్ బ్లాక్ కలర్ సూట్ ధరించి డైనమిక్ అండ్ స్టైలిష్ లుక్ లో అదరగొట్టిన ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తంగా ఈ లుక్స్ ని బట్టి చూస్తుంటే రాబోయే NTR 30 మూవీలో పవర్ఫుల్ లుక్ లో ఎన్టీఆర్ అలరించడం ఖాయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు