ఫన్నీగా మారిపోయిన తారక్ సౌత్ లో నార్త్ ప్రమోషన్స్.!

Published on Mar 24, 2022 3:00 pm IST


మామూలుగానే దర్శకుడు రాజమౌళి సినిమాలకి ప్రమోషన్స్ ఏ లెవెల్లో ఉంటాయో అందరికీ తెలిసిందే. గతంలో బాహుబలి రెండు భాగాలకు చూసాం ఇపుడు తన మరో మోస్ట్ అవైటెడ్ సినిమా “రౌద్రం రణం రుధిరం” కి చూస్తున్నాం. మరి ఈ సినిమాని ఎట్టకేలకి థియేటర్స్ లో తీసుకొస్తుండడంతో సినిమా హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లకి రెండు సార్లు రాజమౌళి మూలంగా వాయింపు తప్పలేదు.

అయితే మొదటి నుంచి కూడా ఈ ప్రమోషన్స్ లో తారక్ చాలా యాక్టీవ్ గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. మరి ఈ ప్రమోషన్స్ లో ఒక్క రోజులోనే ఎన్నెన్నో ఇంటర్వ్యూలు ఇతరాత్ర భాషల్లో ఇచ్చుకుంటూ వెళ్లిపోతున్నారు. అయితే ఇక్కడే ఓ ఫన్నీ ఇన్సిడెంట్ జరగడం వైరల్ గా మారింది.

తారక్ కి రెస్ట్ లేదో ఏమో కానీ తాజాగా మన దగ్గర తెలుగులో ఓ ఇంటర్వ్యూ కి ఈ ముగ్గురూ అటెండ్ కాగా తారక్ ని యాంకర్ ఓ ప్రశ్న అడిగారు ముందు తెలుగులోనే అడిగినా లాస్ట్ లో మాత్రం ఇంగ్లీష్ లో ముగించడం వల్లనో ఏమో కానీ ఆ ప్రశ్నకి తారక్ చాలా కాన్ఫిడెంట్ గా హిందీలో సమాధానం చెప్పడం స్టార్ట్ చేసాడు.

దీనితో పక్కనే ఉన్న రాజమౌళి ఏంటి హిందీలో మాట్లాడుతున్నావ్ తెలుగులో కదా అని అలర్ట్ చెయ్యగా సడెన్ గా ఎన్టీఆర్ అలర్ట్ అయ్యాడు. దీనితో ఈ క్లిప్ మంచి ఫన్నీ గా మారిపోయి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా తారక్ నార్త్ ప్రమోషన్స్ సౌత్ లో జరిగిపోయాయి.

సంబంధిత సమాచారం :