లేటెస్ట్ : తారకరత్న హెల్త్ అప్ డేట్ పై బాలయ్య కు ఎన్టీఆర్ ఫోన్ ?

Published on Jan 28, 2023 1:33 am IST


నటుడు నందమూరి తారకరత్న తొలిసారిగా ఒకటో నెంబర్ కుర్రోడు సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. అక్కడి నుండి వరుసగా హీరోగా సినిమాలు చేస్తూ కొనసాగిన తారకరత్న మధ్యలో విలన్ గా కూడా పలు సినిమాలు చేసారు. అయితే ఇటీవల టీడీపీ తరపున రాజకీయ జీవితం ప్రారంభించిన తారకరత్న, ప్రస్తుతం నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొంటున్నారు. అయితే నేడు మధ్యాహ్నం పాదయాత్రలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు తారకరత్న.

కాగా తక్షణం ఆయనని సమీప ఆసుపత్రికి తరలించగా హార్ట్ స్ట్రోక్ వచ్చిందని తేల్చారు వైద్యులు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయనని ప్రస్తుతం బెంగరులు తరలిస్తున్నాం అని అతడు త్వరలోనే కోరుకుంటాడని ఆశాబావాన్ని వ్యక్తం చేసారు బాలకృష్ణ. ఇక నేడు సాయంత్రం తారకరత్న ఆరోగ్యం పై బాలకృష్ణకి ప్రత్యేకంగా ఫోన్ చేసి హెల్త్ అప్ డేట్ అడిగి తెలుసుకున్నారట యంగ్ టైగర్ ఎన్టీఆర్. అలానే అతి త్వరలో తారకరత్న అన్న కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఎన్టీఆర్ మాట్లాడారట.

సంబంధిత సమాచారం :