‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ పాట.. నిజమేనా ?

Published on Nov 22, 2021 9:39 am IST

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలయికలో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. కాగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2022 జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా పదివేలకు పైగా థియేటర్స్ లో, పలు భాషల్లో ఆర్ ఆర్ ఆర్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రాజమౌళి భారీగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అయితే, ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఓ సాంగ్ పాడారని ఒక రూమర్ బాగా వినిపిస్తోంది. కానీ, ఈ రూమర్ లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది.

మొత్తానికి ఆర్ఆర్ఆర్ పై వచ్చే ప్రతి అప్ డేట్ దేశవ్యాప్తంగా ఫుల్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం, చరణ్ అల్లూరి పాత్రల్లో కనిపించబోతున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తర్వాత జక్కన్న చేస్తున్న సినిమా కావడంతో భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లోనూ ఈ చిత్రం పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :