టాలీవుడ్ సినిమా దగ్గర మాత్రమే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫేమ్ ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోస్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా ఒకరు. అయితే ఎన్టీఆర్ ఇప్పుడు పలు భారీ ప్రాజెక్ట్ లలో బిజీగా ఉండగా ఆ మధ్య తారక్ తన వ్యక్తిగత హక్కుల రక్షణ నేపథ్యంలో న్యాయస్థానంని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన పేరుని కానీ ఫోటోలు లేదా ఇతర తనకి సంబంధించిన అంశాలు ఎవరైనా దుర్వినియోగం చేయడానికి వీలు లేకుండా ఉండేలా తాను కోరడం జరిగింది.
ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి వచ్చిన ప్రెస్ నోట్ లో పలు కీలక అంశాలు ప్రస్తావించబడ్డాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 19 మరియు 21 ప్రకారం జీవించే హక్కు మరియు స్వేచ్ఛకు వ్యక్తిత్వం మరియు ప్రచార హక్కులు మరియు కాపీరైట్ చట్టం, 1957 మరియు ట్రేడ్ మార్క్స్ చట్టం, 1999లోని నిబంధనల ప్రకారం ఎన్టీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ని నటుడు దాఖలు చేసిన పిటిషన్‌ను అనుసరించి కోర్టు జోక్యం చేసుకుంది.
ఈ సమస్యను పరిగణనలోకి తీసుకున్న గౌరవనీయమైన హైకోర్టు తారక్ వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పించింది. ఈ రక్షణ తన తాలూకా అనధికారిక వాణిజ్య ఉపయోగం మరియు “ఎన్టీఆర్”, “జూనియర్ ఎన్టీఆర్”, “ఎన్టీఆర్ జూనియర్”, “తారక్”, “నందమూరి తారక రామారావు జూనియర్”, “జూనియర్ నందమూరి తారక రామారావు” వంటి ప్రసిద్ధ పేర్లను మరియు “మ్యాన్ ఆఫ్ మాస్”, “యంగ్ టైగర్” తో పాటుగా తనపై ఫోటోలు లేదా వీడియో మార్ఫ్ లాంటివి చేసిన తన పేర్లని అనధికారికంగా వినియోగించిన వారు శిక్షార్హులు అని తారక్ ఆఫీస్ నుంచి ప్రెస్ నోట్ ద్వారా స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే ఇప్పుడు వచ్చేసింది. దీనితో ఈ ప్రెస్ నోట్ సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.
