ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా (వర్కింగ్ టైటిల్ డ్రాగన్ లేదా బ్రూస్ లీ) పై లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. హై-యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడానికి చిత్ర బృందం జోర్డాన్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఐతే, కొన్ని తెలియని కారణాల వల్ల చిత్ర బృందం ఊహించిన దానికంటే ముందుగానే షూటింగ్ ముగించాలని ప్లాన్ చేస్తున్నట్లు మేం ఇంతకుముందే చెప్పాం. కాగా తాజాగా జోర్డాన్ లో షూటింగ్ ముగిసింది. జూనియర్ ఎన్టీఆర్ ఈ ఉదయం జోర్డాన్ నుండి తిరిగి వవస్తూ హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు.
భారీ స్థాయిలో, భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్ అద్భుతంగా ఉంటుందట. పైగా ఈ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. అందుకే, ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైమ్ తీసుకున్నాడు. కాబట్టి, ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
