లేటెస్ట్ : సమంత త్వరగా కోలుకోవాలంటూ ఎన్టీఆర్ ట్వీట్

లేటెస్ట్ : సమంత త్వరగా కోలుకోవాలంటూ ఎన్టీఆర్ ట్వీట్

Published on Oct 30, 2022 12:10 AM IST


టాలీవుడ్ స్టార్ కథానాయిక సమంత రూత్ ప్రభు ప్రస్తుతం యశోద అనే పాన్ ఇండియన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అతి త్వరలో నవంబర్ 11న రిలీజ్ కి రెడీ అవుతోంది ఈ మూవీ. హరి, హరీష్ ద్వయం ఈ మూవీని ఎంతో భారీ స్థాయిలో తెరకెక్కించారు. దానితో పాటు గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే మైథలాజికల్ డ్రామా మూవీ కూడా చేస్తున్నారు సమంత. ఆ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అయితే విషయం ఏమిటంటే, గత కొన్నాళ్లుగా తాను మాయోసైటిస్ అనే కండరాల వ్యాధికి చికిత్స తీసుకుంటున్నట్లు కొద్దిసేపటి క్రితం తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా షాకింగ్ న్యూస్ ని బయటపెట్టారు సమంత.

ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుండి మెల్లగా కోలుకుంటున్నా, దాని నుండి బయటపడడానికి కొంత సమయం పడుతుంది, మీ అందరి ప్రేమాభిమానాల వలన ఆత్మవిశ్వాసంతో ఆ వ్యాధిని త్వరలోనే జయిస్తాను అనే నమ్మకం ఉంది అంటూ సమంత పెట్టిన పోస్ట్ చూసిన అనేక మంది ఆమె అభిమానులు, ప్రేక్షకులు, ఆ వ్యాధి నుండి ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతూ గెట్ వెల్ సూన్ అంటూ సోషల్ మీడియా అకౌంట్స్ మెసేజెస్ చేస్తున్నారు. ఇక కొద్దిసేపటి క్రితం సమంత ట్వీట్ ని రీట్వీట్ చేసిన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, నువ్వు త్వరలోనే కోలుకోవాలి, నీకు ఆ వ్యాధి నుండి కోలుకునే శక్తిని దేవుడు అందించాలని కోరుతూ ఎన్టీఆర్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు