లేటెస్ట్.. తన డాషింగ్ లుక్స్ తో అదరగొట్టిన తారక్.!

Published on Mar 11, 2023 8:09 am IST


ఇండియన్ సినిమా ప్రైడ్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” గ్లోబల్ సక్సెస్ లో భాగంగా సినిమా హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు ఇద్దరూ కూడా ప్రస్తుతం అకాడమీ ఈవెంట్ కోసం యూఎస్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వారితో పాటుగా వారి ‘నాటు’ టీం అంతా అక్కడే ఉన్నారు. మరి ఈ మధ్యలో అయితే హీరోలు కూడ తమ ఫ్యాన్స్ కి కావాల్సిన కిక్ ఇస్తున్నారు.

మరి లేటెస్ట్ గా అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సాలిడ్ లుక్స్ తో అదరగొట్టాడు. బ్లూ కలర్ సూట్ లో ఉన్న కొన్ని స్టన్నింగ్ పిక్స్ అయితే తన ఇన్స్టాలో షేర్ చేయగా వాటిలో డాషింగ్ గా తాను కనిపిస్తున్నాడు. దీనితో ఈ ఫోటోలు ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి. ఇక మొత్తం ఇండియన్ ఆడియెన్స్ అయితే సినిమా ఆస్కార్ అవార్డ్ అందుకోవాలి అని ఆసక్తి గా చూస్తున్నారు. ఇక తారక్ అయితే ఈ పనులు అన్నీ అయ్యాక తన అవైటెడ్ 30వ సినిమాలో జాయిన్ కానున్నారు.

సంబంధిత సమాచారం :