గ్యాంగ్‌స్టర్ లుక్‌లో తారక్.. బెంగళూరులో మాస్ చూపెట్టిన ఫ్యాన్స్..!

NTRjr

బెంగళూరులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సందడి చేశాడు. కిమ్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తారక్ రావడంతో ఆయన్ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. వందలాది మంది ఫ్యాన్స్ హాస్పిటల్ ప్రాంగణం బయట వేచి చూడటంతో ఆ ప్రాంతమంతా జనసందోహంగా మారింది.

ఎన్టీఆర్ అక్కడికి చేరుకోగానే అభిమానుల కేరింతలతో ఆ ప్రదేశం హోరెత్తిపోయింది. తమ అభిమాన నటుడిని దగ్గరగా చూడాలనే ఆరాటంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా ముందుకు రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. జనాన్ని నియంత్రించడం సెక్యూరిటీ సిబ్బందికి సాధ్యం కాకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చినట్లు సమాచారం. ఇంతటి గందరగోళం మధ్యలో కూడా ఎన్టీఆర్ ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తూ, అభిమానులకు అభివాదం చేస్తూ హాస్పిటల్ లోపలికి వెళ్లారు. గుబురు గడ్డంతో స్లిమ్‌గా గ్యాంగ్‌స్టర్ లుక్‌లో ఎన్టీఆర్ కనిపించడంతో అభిమానులు అవాక్కయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్ రాకకు సంబంధించిన వీడియోలు, అక్కడి భారీ క్రౌడ్ విజువల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Exit mobile version