“ఎన్టీఆర్ 30″అప్డేట్స్ పై తారక్ అద్భుత వివరణ.!

Published on Feb 6, 2023 7:03 am IST

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజీ గా ఉన్న భారీ చిత్రాల్లో టాలీవుడ్ నుంచి యంగ్ టైగర్ హీరో గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించనున్న చిత్రం కూడా ఒకటి. మరి ఇది ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాకపోతే ఎక్కువ లేట్ అవుతున్నందున అబిమానులు మాత్రం అంతకంతకు తొందర పడుతున్నారు.

దీనితో ఎన్టీఆర్ 30 అప్డేట్ కోసం సోషల్ మీడియాలో చేయని హంగామా లేదు. ఇక ఫైనల్ గా ఈ అంశం పై ఏకంగా ఎన్టీఆర్ నే స్వయంగా స్పందించాల్సి వచ్చింది. నిన్న అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఎన్టీఆర్30 అప్డేట్ ఏదైనా ఉంటే తాము తప్పకుండా అందిస్తామని కానీ మీరు ఇలా నాన్ స్టాప్ గా అడగడం డైరెక్టర్ అండ్ టీం కి చాలా ప్రెజర్ పెట్టినట్టు ఉంటుంది అని ఖచ్చితంగా పవర్ ఫుల్ అప్డేట్ ఏదన్నా ఉంటే తమ ఇంట్లో వాళ్ళకి కూడా రివీల్ చేయకుండా మీతో పంచుకుంటామని.

ఇది నా విన్నపం అని తారక్ చెప్పారు. అలాగే ఇప్ఫడు తెలుగు సినిమా గ్లోబల్ గా నెంబర్ 1 స్థానంలో ఉంది. అలాంటప్పుడు సినిమా ఇంకెంత ఫోకస్ గా తీయాలి అని తారక్ అద్భుత వివరణ తో అయితే ఫ్యాన్స్ కి నిర్దేశించారు. దీనితో ఇక్కడ నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగుతారని చెప్పవచ్చు. ఎందుకంటే సినిమా పరంగా హీరో మాటని జవదాటాని అభిమాని లేడు.

సంబంధిత సమాచారం :