ముందు కంటే బెటర్ టీఆర్పీ రాబడుతున్న తారక్.!

Published on Sep 10, 2021 1:30 pm IST


ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న గ్రాండ్ రియాలిటీ షో “ఎవరు మీలో కోటీశ్వరులు”. చాలా కాలం తర్వాత తారక్ మళ్ళీ స్మాల్ స్క్రీన్ పై కనిపిస్తుండడంతో మంచి అంచనాలు ఈ షో పై కూడా నెలకొన్నాయి. మరి ఈ అంచనాలకు తగ్గట్టుగానే ఈ షో లాంచ్ ఎపిసోడ్ కి భారీ టీఆర్పీ ని తారక్ రాబట్టాడు. మరి అంతే కాకుండా ఇంతకు ముందు ఏ సీజన్లో కూడా రాని యావరేజ్ తో షో ని నడిపిస్తున్నాడని కూడా టాక్ బయటకి వచ్చింది.

అయితే ఇప్పుడు లేటెస్ట్ టాక్ ప్రకారం అసలు ఈ సీజన్ లాంచ్ అయ్యిన వారంతో పోలిస్తే ఆ తర్వాత వారం బెటర్ టీఆర్పీ ని తారక్ రాబట్టగలిగినట్టు తెలుస్తుంది. మొదటి వారం యావరేజ్ 5.62 తో పోలిస్తే రెండో వారం యావరేజ్ గా 6.48 టీఆర్పీ రేటింగ్ ఈ షో కి వచ్చిందట. ఇది ఈ సీజన్లో నే కాకుండా ఇప్పటి వరకు సీజన్స్ లోనే అత్యధికం అని తెలుస్తుంది. మరి దీనికి అంతా కారణం భారీ స్థాయిలో ఈ షో కి వ్యూ వర్ షిప్ పెరిగి చూసేలా చెయ్యడమే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :