తారక్ తన క్యాలిబర్ కి తగ్గ సాలిడ్ ప్రాజెక్ట్ టేకప్ చేయనున్నాడా.?

Published on Sep 12, 2021 6:00 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనా చాతుర్యం కోసం తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పే పని లేదు.. ఇది వరకు ఎన్నో సినిమాల్లో మరెన్నో డిఫరెంట్ రోల్స్ తో అద్భుత పాత్రలను రక్తి కట్టించాడు. ఎలాంటి సన్నివేశాలను అయినా కూడా సునాయాశంగా చేసేయగలిగే తారక్ తన క్యాలిబర్ కి తగ్గ మరో దర్శకునితో సినిమా చేయనున్నాడని ఇప్పుడు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కోలీవుడ్ కి చెందిన ఇంటెన్స్ సినిమాల దర్శకుడు వెట్రిమారన్ తో తారక్ ఓ సినిమా చేయనున్నాడని ఇప్పుడు వైరల్ అవుతున్న నయా గాసిప్స్. ప్రస్తుతం జస్ట్ టాక్ లోనే ఉన్న ఈ కాంబో నిజం అయితే వేరే లెవెల్లో ఉంటుందని చెప్పాలి. తారక్ ఇంటెన్స్ నటనకి వెట్రిమారన్ టేకింగ్ తోడైతే ఆ అవుట్ పుట్ ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

వెట్రిమారన్ పేరు తన ‘అసురన్’ తెలుగులో ‘నారప్ప’ గా రీమేక్ అయ్యిన తర్వాత నుంచి టాలీవుడ్ బాగానే వినిపిస్తుంది. మరి ఈ సెన్సేషనల్ కాంబోపై ఇప్పుడు వస్తున్న ఈ ఊహాగానాలు ఎంతవరకు నిజమో అన్నది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :