కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ కోసం ఎన్టీఆర్ ప్రెజెన్స్ ?

Published on Jul 25, 2022 7:01 am IST

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా ఓ చారిత్రక కథాంశంతో రాబోతున్న సినిమా ‘బింబిసార’. ఎ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌.. అన్నది ఉపశీర్షిక. కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించిన ఈ ఫాంటసీ డ్రామా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. జూలై 29న జరగనున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా రానుందని ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్స్ నిజమైతే ఎన్టీఆర్ ప్రెజెన్స్ ఈ సినిమా హైప్ ని మరో లెవెల్ కి తీసుకెళ్తుంది.

ఇక, ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రాన్ని చూశారని, ఎన్టీఆర్ కి ఈ సినిమా అవుట్‌ పుట్‌ చాలా బాగా నచ్చిందని తెలుస్తోంది. అన్నట్టు ఇప్పటికే ఈ సినిమాకు మంచి బజ్ ఉంది. కల్యాణ్‌ రామ్‌ ఈ సినిమాలో బింబిసార అనే క్రూరమైన రాజుగా శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమా.. తెలుగుతో పాటు అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానుంది. వశిష్ట్‌ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో కేథరీన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :