ఎక్కువ బ్రేక్స్ లేకుండా ప్లాన్ చేస్తున్న ఎన్టీఆర్ !

ఎక్కువ బ్రేక్స్ లేకుండా ప్లాన్ చేస్తున్న ఎన్టీఆర్ !

Published on Nov 28, 2022 9:00 AM IST

ఎన్టీఆర్ ఫ్యాన్స్ దృష్టి మొత్తం ఎన్టీఆర్ 30, ఎన్టీఆర్ 31 చిత్రాల పైనే ఉంది. అయితే, కొరటాల సినిమాని డిసెంబర్ లో స్టార్ట్ చేసి.. ఎక్కువ బ్రేక్స్ లేకుండా త్వరగా షూట్ ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ సినిమాని 2023 సమ్మర్ లో ప్లాన్ చేయనున్నాడు. ఈ సినిమాకి కూడా ఎన్టీఆర్ ఎక్కువ బ్రేక్స్ లేకుండా స్పీడ్ గా షూట్ ఫినిష్ చేయనున్నాడు. ఇప్పటికే పాన్ ఇండియా డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ కి ఫుల్ డిమాండ్ క్రియేట్ అయ్యింది. పైగా ఎన్టీఆర్ తో భారీ యాక్షన్ డ్రామాను తెరకెక్కించాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

అందుకే ఈ సినిమా పై తారక్ ఫ్యాన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఏది ఏమైనా ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో సినిమా వస్తోంది అనేసరికి నేషనల్ రేంజ్ లో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి, ప్రశాంత్ నీల్ విజువల్స్ తోడు అయితే.. మరో వండర్ ఫుల్ సినిమా అయ్యే అవకాశం ఉంది. అటు కొరటాల సినిమా పై కూడా తెలుగులో భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు