కొరటాల సినిమాకి ఎన్టీఆర్ డేట్ ఫిక్స్ చేశాడా ?

Published on Oct 3, 2022 10:00 am IST

‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ – క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రాబోతున్న పాన్ ఇండియా చిత్రానికి సంబంధించిన తదుపరి అప్‌ డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అసలు ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది ? అంటూ ఫ్యాన్స్ చాలా క్యూరియాసిటీ గా ఎదురు చూస్తున్నారు. ఐతే, లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి షురూ కానుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ లోని సెట్ కూడా రెడీగా ఉంది. ప్రస్తుతం ఈ సెట్ కి కొన్ని మరమత్తులు చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ అదిరిపోతుందని, చాలా స్టైలిష్‌గా ఉంటుందని తెలుస్తోంది. పైగా ఎన్టీఆర్ ఈ సినిమా కోసం బరువు కూడా తగ్గాడు. పైగా తన పాత్ర కోసం తారక్ డిఫరెంట్ మేకోవర్‌ ట్రై చేస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అన్నట్టు 2023 సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :