వైరల్ వీడియో : యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం యుఎస్ఏ ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ అరేంజ్మెంట్స్

Published on Jan 9, 2023 11:37 pm IST

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్. గతేడాది రిలీజ్ అయి సంచలన విషయం అందుకున్న ఈ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీం గా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించారు. గ్లోబల్ గా ఎందరో ప్రేక్షకాభిమానులు, సినిమా ప్రముఖుల నుండి గొప్ప పేరు సొంతం చేసుకున్న ఈ మూవీని గోల్డెన్ గ్లోబ్ అవార్డుల సెర్మనీ లో భాగంగా యుఎస్ఏ లోగల లాస్ ఏంజెల్స్ లోని టిసిఎల్ చైనీస్ ఐమ్యాక్స్ లో ప్రత్యేకంగా ప్రదర్శించనున్న సంగతి తెలిసిందే.

కాగా ఈ స్పెషల్ స్క్రీనింగ్ కి విచ్చేయనున్న తమ అభిమాన నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా యుఎస్ఏ ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ అరేంజ్మెంట్స్ చేసారు. ఆయనకి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ, వెల్కమ్ టూ హోమ్ ఆఫ్ హాలీవుడ్ యంగ్ టైగర్ అంటూ
అక్కడి పలు ఎల్ఈడి మూవీ ట్రక్స్, హోర్డింగ్స్ పై ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఫోటోలు అందరినీ ఎంతో ఆకట్టుకోవడంతో పాటు ఆ ప్రచార ఫోటోల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ ఈ విధంగా మరింతగా ఆడియన్స్ కి, ఫ్యాన్స్ కి చేరువ అవుతోంది.

సంబంధిత సమాచారం :