వైరల్ : సీక్వెల్ చేస్తే ఆ సినిమాకి చేస్తా అంటున్న తారక్.!

Published on Mar 23, 2022 8:38 pm IST

ప్రస్తుతం మన ఇండియా సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ గా ఉన్నటువంటి భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా విడుదలకి ఇంకా జస్ట్ కొన్ని రోజులే ఉండగా ఈ సినిమా ఇద్దరు స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ సహా దర్శకుడు రాజమౌళి లు ప్రమోషన్స్ లో ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు.

మరి ఇలా జరిగిన ఓ లేటెస్ట్ ఇంటర్వ్యూ లో తారక్ కి పలు ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. మరి వాటిలో తాను చేసినటువంటి చిత్రాల్లో ఓ సినిమాకి సీక్వెల్ ఉండాలి అనుకుంటే దేనికి చెయ్యాలి అనుకుంటున్నారని అడగ్గా తాను ఏమాత్రం ఆలోచించకుండా ఓ సినిమా పేరు చెప్పాడు.

అదే తన కెరీర్ లో ఎవర్ గ్రీన్ ఎంటర్టైనర్ చిత్రం “అదుర్స్”. దర్శకుడు వివి వినాయక్ తో చేసిన ఈ చిత్రం ఇప్పటికీ స్మాల్ స్క్రీన్ పై హిట్టే. ఆ సినిమాలో ఎన్టీఆర్ చేసిన డ్యూయల్ యాక్షన్ గాని హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తో కామెడీ కానీ ఇప్పటికీ మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తాయి. అలాంటి ఈ సినిమాకి ఎన్టీఆర్ సీక్వెల్ చెయ్యాలి అనుకుంటున్నా అని తెలపడం మంచి ఆసక్తిగా ఇప్పుడు మారింది.

సంబంధిత సమాచారం :