క్రేజీ బజ్ : ‘వార్ – 2’ లో ఎన్టీఆర్ అటువంటి పాత్రలో కనిపించనున్నారా ?

Published on May 19, 2023 1:00 am IST

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల మరొక నటుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి దిగ్గజ దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ద్వారా పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీం గా అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించగా మూవీలోని నాటు నాటు సాంగ్ ఏకంగా ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం తన కెరీర్ 30వ మూవీని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నారు ఎన్టీఆర్.

దీని తరువాత ప్రశాంత్ నీల్ తో కెరీర్ 31వ మూవీని కూడా ప్రకటించిన ఎన్టీఆర్, మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 లో నటించనున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై అయాన్ ముఖర్జీ భారీ స్థాయిలో తెరకెక్కించనున్న ఈ మూవీలో ఎన్టీఆర్ ఒకింత నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుండగా ఆ పాత్ర కోసం ఆయన త్వరలో బాడీ పరంగా సంసిద్ధం అవనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ బజ్. కాగా ఈ మూవీ యొక్క షూట్ ని నవంబర్ నుండి ప్రారంభించి వచ్చే ఏడాది చివర్లో దీనిని విడుదల చేయనున్నారట. మరి అందరిలో భారీ హైప్ ఏర్పరిచిన ఈమూవీ గురించిన మరిన్ని అప్ డేట్స్ మరికొంత కాలం ఆగాల్సిందే అని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :