ఈ పనుల్లో కూడా ఫుల్ బిజీగా “దేవర”

ఈ పనుల్లో కూడా ఫుల్ బిజీగా “దేవర”

Published on Jul 7, 2024 10:03 AM IST


మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. టాలీవుడ్ మాస్ ఆడియెన్స్ అలాగే ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంటుంది.

అలాగే మరో పక్క తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయి బిజినెస్ ని ఈ చిత్రం జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంకి మరో పనులు కూడా ఏకకాలంలో జరిగిపోతున్నాయి. అవే డబ్బింగ్ పనులు. మరి లేటెస్ట్ గా యంగ్ నటి హిమజ దేవర సినిమాకి తన డబ్బింగ్ వర్క్ ని స్టార్ట్ చేసినట్టుగా తెలిపింది.

దీనితో ఈ సినిమాలో ఈమె కూడా నటిస్తుంది అని క్లారిటీ తో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరిగిపోతున్నాయి అని క్లారిటీ వచ్చింది. మరి మొత్తానికి అయితే దేవర ఫుల్ స్వింగ్ లో దూసుకెళ్తుంది అని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా మేకర్స్ ఈ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు