ఎన్టీఆర్ – కొరటాల సినిమా షూటింగ్ ఎప్పుడంటే ?

ఎన్టీఆర్ – కొరటాల సినిమా షూటింగ్ ఎప్పుడంటే ?

Published on May 16, 2022 9:01 AM IST

‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ – క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రాబోతున్న పాన్ ఇండియా సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలుస్తోంది. ఈ చిత్రం ఈ జూన్‌లో సెట్స్‌పైకి వస్తుందని వార్తలు మొదట వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా షూటింగ్ ఇంకా ఆలస్యం కానుంది. తాజా అప్‌డేట్‌ ప్రకారం, ఈ చిత్రం జులైలో సెట్స్‌ పైకి వెళ్లనుంది.

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 20న దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమాలో తన పాత్ర కోసం తారక్ డిఫరెంట్ మేకోవర్‌ ట్రై చేస్తున్నారు. ఆల్ రెడీ ఈ సినిమా కోసం 8-9 కిలోల బరువు తగ్గనున్నాడు తారక్. కాగా ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అన్నట్టు 2023 సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు