ఎట్టకేలకు స్టార్ట్ చేయబోతున్న ఎన్టీఆర్… రంగం సిద్ధం!

ఎట్టకేలకు స్టార్ట్ చేయబోతున్న ఎన్టీఆర్… రంగం సిద్ధం!

Published on Jul 11, 2022 7:00 AM IST

‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ – క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రాబోతున్న పాన్ ఇండియా సినిమా షూటింగ్ కు సంబంధించి ఒక అప్ డేట్ తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఆగస్టు నాలుగో వారం నుంచి గానీ, లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో గాని ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది.

ఇక ఈ సినిమా క్లైమాక్స్ కోసం భారీ సెట్ ను నిర్మిస్తున్నారు. క్లైమాక్స్ లో వచ్చే ఈ సెట్ బ్లాస్ట్ సీన్ లో ఎన్టీఆర్ యాక్షన్ అదరిపోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో తన పాత్ర కోసం తారక్ డిఫరెంట్ మేకోవర్‌ ట్రై చేస్తున్నారు. ఈ సినిమా కోసం 8-9 కిలోల బరువు తగ్గనున్నాడు తారక్.

కాగా ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అన్నట్టు 2023 సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు