వైరల్ పిక్ : అల్ట్రా స్టైలిష్ లుక్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్

వైరల్ పిక్ : అల్ట్రా స్టైలిష్ లుక్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్

Published on Nov 11, 2022 9:19 PM IST

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అతి త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో తన కెరీర్ 30వ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలపై ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా రేంజ్ లో రూపొందనున్న ఈ మూవీ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ మూవీ కోసం ఇప్పటికే తన మేకోవర్ ని పూర్తిగా చేంజ్ చేసిన ఎన్టీఆర్, కొద్దిసేపటి క్రితం ఆకట్టుకునే అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఉన్న ఒక పిక్ ని తన ఇన్స్టాగ్రమ్ లో పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కాగా ఈ పిక్ లో ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలిం అఖిమ్ ని కూడా చూడవచ్చు. ఇక ఈ సూపర్ లుక్ లో ఎన్టీఆర్ ని చూస్తుంటే ఎప్పుడో కొన్నేళ్ల క్రితం శ్రీను వైట్ల తీసిన బాద్షా లుక్ గుర్తుకు వస్తుంది అంటూ పలువురు ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తుండడం విశేషం. కాగా ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు