మహేష్ సినిమాపై క్రేజీ అప్ డేట్

Published on May 15, 2023 11:01 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమా గురించి ఇప్పుడు మరో అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ జూన్ మొదటి వారంలో ప్రారంభం కానుందని తాజా సమాచారం. జనవరి 13, 2024న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తెరపైకి రానుంది. కాబట్టి అప్పటిలోగా షూటింగ్ పూర్తి చేయాలంటే.. సాధ్యమైనంత త్వరగా షూట్ స్టార్ట్ చేయాలి. ఈ క్రమంలోనే జూన్ మొదటి వారం నుంచి లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు.

మొత్తానికి పదకొండు సంవత్సరాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో శ్రీలీల కూడా మరో కథానాయికగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :