“జంప్ జిలాని”చిత్ర మాటల రచయిత “క్రాంతిరెడ్డి సకినాల” పుట్టినరోజు (14-06-14 )

writer
కలలు కనండి..సాకారం చేసుకోండీ”అని అబ్దుల్ కలాం గారు అన్నట్లు,కలాన్నిచేతపట్టాడు .. కష్టాలకోర్చాడు.. సినీరచయిత కావాలన్న తన కలని సాకారం చేసుకున్నాడు.అతనే అల్లరి నరేశ్ “జంప్ జిలాని”చిత్ర మాటల రచయిత “క్రాంతిరెడ్డి సకినాల”. చక్కిలిగింతల మాటల పంచ్ లతో “జంప్ జిలాని”చిత్ర విజయం లో ముఖ్య భూమికను పోషించిన ఈ చిలిపి రాతల చిన్నోడి పుట్టినరోజు (14-06-14 )

చిన్నతనం నుంచి సినిమా నే లోకం .. ఏ మాట పలికినా సినిమా తో ముడిపడి ఉండేది.అలా డిగ్రీ పూర్తవ్వగానే సినిమాల్లోకి వెళ్ళాలి అనే ఆలోచనని కుటుంబ సబ్యులకు చెప్పాడు.వారికి పరిచయమున్న నేటి అగ్ర దర్శకుడు”శ్రీను వైట్ల” తో మాట్లాడటం , ఆయన ఇండస్ట్రీ కష్టాలు తట్టుకోలేడని చెప్పి వద్దనటం తో ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోలేదు.. కానీ మనోడి సంకల్పం అక్కడే ఆగి పోలేదు .. ఇంట్లో వాళ్ళని బలవంతంగా ఒప్పించి.. హైదరాబాద్ లో అడుగు పెట్టాడు.డైరెక్ట్ గా వెళ్ళి మాటల రచయిత “చింతపల్లి రమణ”ని కలవటము, ఆయన పెట్టిన కొన్ని పరీక్షల్లో నెగ్గి సహాయకుడిగా చేరాడు.అదృష్టంకొద్ది ఆ సమయం లో ఆయన చాలా బిజీ రచయిత కావటం వల్ల తనకి రావాల్సిన పనిని తొందరగా నేర్చుకునే అవకాశం వచ్చింది.ఎంతగా అంటే ఒక సినిమాకు స్వంతంగా మాటలు రాసేంతగా. ఆ అనుభవం తో s.v. రంగారావు మనవడు ,అంజలీదేవి మనవరాలు ,రావు రమేశ్ ల కాంబినేషన్ లో ఓ చిత్రానికి మాటలు రాసే అవకాశం వచ్చినా అది కాస్త ఆది లోనే ఆగిపోవటం తో.. మళ్ళీ అటు అసిస్టెంట్ రైటర్ గా వెనక్కి వెళ్లలేక చేయటానికి ఇంకో సినిమా లేక మళ్ళీ సినిమా కష్టాలు ప్రారంభం అయ్యాయి.అయినా వెనకడుగు వేయకుండా ఘోస్ట్ రైటర్ గా పలు సినిమాలకు వర్క్ చేశాడు.కానీ ఏ సినిమాకి కూడా రచనా సహకారం కార్డ్ వేసుకోవటానికి ఇష్టపడక పేరు లేకుండానే పనిచేశాడు.తన లక్ష్యం రచయితగా టైటిల్ కార్డ్.అలా తన ప్రయాణాన్ని ఎక్కడా ఆపకుండా ప్రయత్నిస్తూ ,ఒక రోజు నెట్ లో ఇ.సత్తిబాబు , అల్లరి నరేశ్ ల కాంబినేషన్ లో సినిమా ప్రారంభం అవుతుందని చూసి డైరెక్ట్ గా వెళ్ళి e.సత్తిబాబు గారిని కలవడం , అక్కడ కూడా పరీక్షల్లో నెగ్గి “యముడికి మొగుడు” సినిమాతో తన లక్ష్యానికి శంకుస్థాపన చేసి మాటల రచయిత గా మంచి పేరు సంపాదించాడు. మూడు పదులుకూడా నిండని “క్రాంతిరెడ్డి సకినాల” సత్తిబాబు,అల్లరి నరేశ్ ల తదుపరి చిత్రం “జంప్ జిలాని”క్కూడా మాటలు రాసి జనం తో విజిల్స్ వేయించాడు, తనేంటోనిరూపించుకున్నాడు.భవిష్యత్తులో అసిస్టెంట్స్ మీద ఆదారపడకుండా, దర్శకత్వం మీద ఆలోచన రాకుండా పూర్తిస్థాయి రచయితగా మంచి సినిమాలు.. పెద్ద దర్శకుల సినిమాలు చేయాలన్నదే తన ఆశ అని నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న “క్రాంతిరెడ్డి సకినాల” తెలియజేశారు.

Exit mobile version