హనుమాన్ దీక్షలో తారక్.. ఫోటోస్ వైరల్..!

హనుమాన్ దీక్షలో తారక్.. ఫోటోస్ వైరల్..!

Published on Apr 17, 2022 3:02 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల వచ్చిన “ఆర్ఆర్ఆర్” సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా తరవాత ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాలో నటించబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష చేపట్టాడు. మునుపెప్పుడు ఇలాంటి దీక్ష చేపట్టని ఎన్టీఆర్ మొట్టమొదటిసారి హనుమాన్ దీక్షను చేపట్టాడు.

ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాషాయ దుస్తులు.. మెడలో హనుమాన్ మాల, నుదిటిన కుంకుమ తో తారక్ లుక్ ఆకట్టుకుంటుంది. మొదటిసారి ఈ వస్త్రధారణలో తారక్ ను చూసిన అభిమానులు విస్మయానికి గురవుతున్నారు. ప్రస్తుతం తారక్ న్యూ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ దీక్ష అనంతరం తారక్ తిరిగి సెట్స్ లోకి వెళ్లనున్నాడు. హనుమాన్ దీక్షను తారక్ ఎంతో నియమ నిబంధనలతో పూర్తిచేయనున్నారని సన్నిహితులు తెలుపుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు