ఇంత పెద్ద స్టార్స్ తో నటించడం ఒక కల – ఎన్టీఆర్

Published on Dec 9, 2021 6:00 pm IST

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా వివిధ బాషల్లో విడుదల అయ్యేందుకు సిద్దంగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. హిందీ లో ట్రైలర్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ మరియు ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్ పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యం లో జూనియర్ ఎన్టీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ సినిమా లో తన భాష మరియు నటన గురించి హిందీ విమర్శకులు, ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో చూడటానికి చాలా ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు. దేశంలో ఇంత పెద్ద స్టార్స్ తో నటించడం ఒక కల అని, ఆర్ ఆర్ ఆర్ మూవీ కోల్పోయిన భారతీయ సినిమా వైభవాన్ని తిరిగి తెస్తుంది అని ఆశిస్తున్నా అంటూ జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.

ఈ చిత్రం లో అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :