అన్ స్టాపబుల్: ఆ ఎపిసోడ్ బిగ్గెస్ట్ రికార్డ్ కొట్టడం ఖాయం..!

Published on Nov 2, 2021 1:43 am IST


నందమూరి బాలకృష్ణ తొలిసారి ఓటీటీ వేదిక ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 12 ఎపిసోడ్‌లుగా స్ట్రీమింగ్ కానున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రోమో మరియు తొలి ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోకు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. తొలి ఎపిసోడ్‌కి డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ హాజరైనట్టు తెలుస్తుంది. నవంబర్ 4న ప్రసారం కానున్న ఈ ఫస్ట్ ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ షోకు సంబంధించిన మ‌రో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హల్ చల్ చేస్తుంది. జూనియర్ ఎన్‌టీఆర్ ఈ షోలో సందడి చేయనున్నారట. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి హింట్ అయితే లేదు కానీ బాబాయ్ అబ్బాయి కనుక ఒకే వేదికను పంచుకుంటే మాత్రం ఆ ఎపిసోడ్ ఖచ్చితంగా బిగ్గెస్ట్ రికార్డ్‌ను క్రియేట్ చేయడం గ్యారెంటీ అనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్, నేచురల్ స్టార్ నాని, దగ్గుబాటి రానా కూడా పాల్గొంటారని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :

More